గణతంత్ర వేడుకలకు మొబైల్ యాప్
కరోనా కారణంగా గణతంత్ర వేడుకలపై ఈసారి ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది. కవాతు విన్యాసాల్లో పాల్గొనే సిబ్బంది కుదింపుతో పాటు వీక్షకుల సంఖ్యను కూడా తగ్గించింది. అయితే, రిపబ్లిక్ డే వేడుకలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనివారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మొబైల్‌యాప్ విడుదల చేసింది.
‘రిపబ్లిక్ డే పరేడ్ 2021’ లేదా ‘ఆర్‌డీపీ 2021’ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌ను కేంద్ర రక్షణ శాఖ సోమవారం విడుదల చేసింది. దీని ద్వారా పరేడ్ విన్యాసాలు, శకటాల ప్రదర్శన, ఇతర వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్ ప్లేస్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
గణతంత్ర వేడుకల కోసం దేశ రాజధాని
ముస్తాబవుతోంది. సాధారణంగా ఏటా ఈ ఉత్సవాలు ఎర్రకోటలో జరుగుతాయి. అయితే, కరోనా
దృష్ట్యా ఈసారి పరేడ్ దూరాన్ని తగ్గించారు. అంతేగాక, పదేళ్లలోపు
చిన్నారులను కూడా అనుమతించట్లేదు. మరోవైపు ఈ వేడుకల్లో తొలిసారి రఫేల్
యుద్ధవిమానం సందడి చేయనుంది.
0 Komentar