Sensex Hits 50,000-Mark for First Time
Ever
సెన్సెక్స్ సంచలనం @50,000
కరోనా వైరతో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. డిమాండ్ పతనం.. ఇవన్నీ బీఎస్ఈలో బుల్ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఎట్టకేలకు నేడు తొలి సారి 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది. గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్ 306 పాయింట్ల లాభంతో 50,098 వద్ద నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 14,736 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన రంగాల సూచీల్లోని అన్ని రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
నిన్న అమెరికాలో బైడెన్ సర్కారు
ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్లో జోరును నింపింది. ముఖ్యంగా ట్రంప్ విధించిన
ఆర్థిక ఆంక్షలు తొలగే అవకాశాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరో భారీ ఆర్థిక
ప్యాకేజీ అమెరికాలో వెలువడే అవకాశం ఉండటం కూడా సూచీల్లో ఉత్తేజం నింపింది.
0 Komentar