Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Toycathon 2021 Idea Submission Deadline Is Now Extended

 

Toycathon 2021 Idea Submission Deadline Is Now Extended

Toy Hackathon 2021: రూ.50 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. మీ ఐడియాలను పంపించడానికి జనవరి 31 ఆఖరు తేదీ.

మనం వాడే బొమ్మలను మన దేశంలోనే తయారయ్యేలా చేయడం.. బొమ్మల తయారీకి భారత్‌ను హబ్ గా మార్చడమే ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం Toycathon-2021 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులు, తయారీలో నిపుణులు, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు గెట్ టు గెదర్ గా మారి భారత సంప్రదాయం, వృత్తులు, జాన పద సంస్కృతి, హీరోలు, హీరోయిన్లు, మన దేశ విలువలకు అనుగుణంగా బొమ్మలు, ఆటలు రూపొందించడనానికి ఆలోచనలను పంచుకోవడానికే ఏర్పాటైనదే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై రూ. 50 లక్షల వరకు గెలుచుకోవచ్చు. 

విజేతలకు రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంటుంది. పూర్తి వివరాలకు https://toycathon.mic.gov.in/ ను చూడొచ్చు. ఏమైనా సందేహాలుంటే toycathon@aicte-india.org ఐడీకి మెయిల్ చేయొచ్చు. మీ ఐడియాలను పంపించడానికి జనవరి 31 ఆఖరు తేదీ. 

ప్రధాన ఉద్దేశం ఇదే:

పిల్లల్లో పాజిటీవ్ ఆలోచనలు, మంచి విలువలు పొంపెందేలా బొమ్మలను ను తయారు చేసేలా కాన్సెప్ట్ లను రూపొందించడం.

భారత టాయ్ మార్కెట్ ను 1 బిలియన్ కు చేర్చడం

33 కోట్ల విద్యార్థుల ఇన్నోవేటివ్ ఐడీయాలకు రూపం ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.  

మూడు దశల్లో పాల్గొనొచ్చు:

1. జూనియర్ లెవెల్ (Junior Level)

2. సీనియర్ లెవెల్ (Senior Level)

3. స్టార్టప్ లెవెల్ (Start-up Level). 

ఎవరు పాల్గొంటారంటే..?

ఈ కార్యక్రమంలో కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు, స్టార్టప్ కంపెనీలు, టాయ్ ఎగుమతిదారులు పాల్గొంటారు. పాల్గొనేవారికి రెండు ఆప్షన్లు ఉంటాయి. వారు పబ్లిష్ చేసిన సమస్యలకు ఐడియాలు ఇవ్వొచ్చు. లేదా టాయ్ కాన్సెప్టుల కేటగిరీలో చేరవచ్చు. 

9 ప్రత్యేక థీమ్స్:

భారతీయ సంస్కృతి

చరిత్ర

భారత దేశంపై నాలెడ్జ్, నీతి, నియమాలు

నేర్చుకోవడం, నేర్పించడం, స్కూలింగ్ చేయడం

సామాజిక, మానవత్వ విలువలు

వృత్తులు, ప్రత్యేక రంగాలు

పర్యావరణం, దివ్యాంగులు

ఫిట్‌నెస్, క్రీడలు

వాటితోపాటూ క్రియేటివ్, లాజికల్ ఆలోచనలు, భారతీయ పాత బొమ్మలను తిరిగి కనిపెట్టుట, తిరిగి తయారుచేయుట ఉంటాయి.


 

Previous
Next Post »
0 Komentar

Google Tags