టిఎస్: మే 17 నుంచి 'పది' వార్షిక పరీక్షలు
పదో తరగతి వార్షిక పరీక్షల్ని 17 నుంచి 26 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులు ప్రారంభమవుతాయి అని తెలిపింది. మార్చి 15 నుంచి అంతర్గత పరీక్షలు(ఎఫ్‌ఏ)-1 , ఏప్రిల్ 15 నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు, మే 7 నుంచి 13వరకు ఎస్‌ఏ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మే 27 నుంచి జూన్ 13వరకు వేసవి సెలవులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
0 Komentar