TS ePASS Scholarship 2020-21: Post
Matric Scholarship Registrations for Fresh and Renewal Extended
Telangana EPASS: ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించింది.
పోస్టుమెట్రిక్ విద్యార్థుల
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు
ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.
తొలుత దరఖాస్తు స్వీకరణకు డిసెంబర్ 31, 2020ని డెడ్‌లైన్‌గా పెట్టినప్పటికీ.. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం, దానికితోడు రెన్యువల్ విద్యార్థులు సైతం ఇంకా పూర్తిస్థాయి దరఖాస్తులు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 15వ
తేదీ వరకు ఈపాస్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించింది.
ఆసక్తిగల అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్
చూడొచ్చు. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు
పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి 2020-21
విద్యాసంవత్సరంలో 12.65 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు
చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి.
Epas
ReplyDelete