టిఎస్: ఐసెట్ మూడో విడత కౌన్సెలింగ్
కు పచ్చజెండా - హైకోర్టు ఆదేశం నేపథ్యంలో ప్రభుత్వ
అనుమతి
ఎంబీఏ, ఎంసీఏ
కోర్సుల్లోకి ప్రవేశం కోసం ఐసెట్ మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిగ్రీ బ్యాక్ లాగ్ ఫలితాలు రాకముందే కౌన్సెలింగ్ ను
సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. దాంతో వేలాది విద్యార్థులకు అన్యాయం జరిగిందని
ఒకరు హైకోర్టును ఆశ్రయించగా 48 గంటల్లో మరోసారి ఐ సెట్ కౌన్సెలింగ్ కు కాలపట్టిక
ఇవ్వాలని హైకోర్టు ఈనెల 18న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో మూడో విడత
కౌన్సిలింగ్ నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్
ఉన్నత విద్యామండలికి అనుమతి ఇచ్చారు. గురువారం కౌన్సెలింగ్ కాలపట్టికను ప్రకటిస్తామని
ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
0 Komentar