TS Intermediate Classes For 68 Days
Exams Likely from May 3
టిఎస్: మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు – ప్రాక్టికల్స్ మినహాయింపు లేదు
టీఎస్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్ కేలండర్ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్ రూపకల్పనపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.
68 రోజులు..!
అకడమిక్ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్, రివిజన్ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం.
మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. ఆ పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. అయితే తొలగించే 30% సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది.
ఇదివరకు ఐదు ప్రశ్నలిచ్చి మూడింటికి సమాధానాలు రాయాలని సూచించేవారు. ప్రస్తుతం 7 నుంచి 9 ప్రశ్నలిచ్చి మూడింటికి జవాబులు రాసే అవకాశం కల్పించబోతున్నారని సమాచారం.
ప్రాక్టికల్స్:
ఎంపీసీ, బైపీసీ
విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాక్టికల్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో మినహాయించేది లేదని అధికారులు
తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలైన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని
పేర్కొన్నారు.
0 Komentar