TS Postal Circle GDS Recruitment 2021: 1150 Vacancies Notified
తెలంగాణ సర్కిల్‌లో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు
భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన హైదారబాద్‌లోని తెలంగాణ సర్కిల్‌కి చెందిన చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
* గ్రామీణ డాక్ సేవక్
1) బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
3) డాక్ సేవక్
* మొత్త ఖాళీలు: 1150
అర్హత: మ‌్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టు్లతో పదో తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్‌లో చదివి ఉండాలి. కనీసం 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్‌ను ఒక సబ్జెక్టుగా పదో తరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి.
వయసు: 27.01.2021 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: టైమ్ రిలేటెడ్
కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్‌సీఏ) పద్థతిలో వీరికి చెల్లింపులు ఉంటాయి.
* బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం): కనీసం 4 గంటలకు టీఆర్‌సీఏ రూ. 12000, కనీసం 5 గంటలకు టీఆర్‌సీఏ రూ.14500 చెల్లిస్తారు.
* ఏబీపీఎం/ డాక్ సేవక్: కనీసం 4 గంటలకు టీఆర్‌సీఏ రూ. 10000, కనీసం 5 గంటలకు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో
అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్
మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలకు అదనపు వెయిటేజ్ ఏమీ ఉండదు.
కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట‌్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ట‌్రాన్స్-విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2021.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.02.2021.
0 Komentar