తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి తరగతులు - 9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన
తెలంగాణలో పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1వ
తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి
సమావేశమయ్యారు. తొలుత చివరి సంవత్సరం విద్యార్థులకే తరగతులు ఉంటాయని ఉన్నత
విద్యామండలి ప్రతిపాదిస్తున్న అంశంపై కళాశాలల యాజమాన్య సంఘాలు ప్రస్తావించగా...
అన్ని సంవత్సరాల విద్యార్థులకు 1వ తేదీ నుంచి తరగతులు
మొదలవుతాయని, వేర్వేరుగా కాదని మంత్రి.. . కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తలు వివరించారు. మంత్రి మాట్లాడుతూ,
ఇంటర్ పరీక్షలకు సంబంధించి పాఠ్య ప్రణాళిక, పరీక్షల
తేదీలు, ప్రయోగ పరీక్షలు విషయంలో వారం రోజుల్లోగా
తెలియజేస్తామన్నారు.
జాతీయ ప్రవేశ పరీక్షల సిలబసకు
అనుగుణంగా ఎంసెట్ పరీక్షకు సంబంధించిన పాఠ్య ప్రణాళికపై స్పష్టత ఇస్తామని
తెలిపారు. పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేయడం లేదని, విద్యార్థుల
తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని తల్లిదండ్రుల
కమిటీకి తెలిపారు.
0 Komentar