Telangana Teacher Selected for Fulbright
Teaching Excellence and Achievement Program
ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్‌కి తెలంగాణ ఉపాధ్యాయుడి ఎంపిక
అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక
ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్‌కి తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట
మండలం నారాయణపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు లింగాల రాజు
ఎంపికయ్యారు. ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీఈఏ)
కింద 2019-20 విద్యా సంవత్సరానికి భారత్ నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపిక కాగా అందులో
రాజు ఒకరు. ఈ కార్యక్రమం కింద ఆయన ఆరు వారాలపాటు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో
ఆంగ్ల బోధనపై శిక్షణ పొందుతారు. ఆ వర్సిటీల అనుబంధ పాఠశాలల్లో బోధన చేస్తారు.
అమెరికా-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్(యూఎస్‌ఐఈఎఫ్) ఏటా కొంత మంది ఉపాధ్యాయులను ఈ
ప్రోగ్రామ్‌కి ఎంపిక చేస్తుంది. రాజు ఈ నెలలోనే అమెరికా చేరాల్సి ఉండగా కరోనా
కారణంగా సెప్టెంబరులో వెళ్లనున్నారు. తాను 2018లో తుది రౌండ్‌కు
చేరుకున్నా ఎంపిక కాలేదని, ఈసారి అది నెరవేరిందని రాజు ఆనందం
వ్యక్తం చేశారు.
0 Komentar