UK begins major trial for new
inhaler-based COVID-19 treatment
కరోనాకు ఇన్‌హేలర్ ఆధారిత చికిత్స
కొవిడ్-19 బాధితులు త్వరగా కోలుకొనేందుకు బ్రిటన్‌లోని సినైర్‌జెన్స్ సంస్థ ఇన్‌హేలర్ ఆధారిత చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా వైరస్ సోకినప్పుడు శరీరంలో ఇంటర్ ఫెరాన్ బీటా-1ఏ (ఎస్‌ఎన్‌జీ001) అనే ప్రొటీన్ కణాలు విడుదల అవుతాయి. వైరస్‌లను నిలువరిస్తాయి. ఈ ఇన్‌హేలర్‌నూ ఎస్‌ఎన్‌జీ001తోనే రూపొందిస్తుండటం గమనార్హం. ఆక్సిజన్ అవసరమైన 20 దేశాల్లోని 610 మంది కరోనా బాధితులు ట్రయల్స్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
‘కొవిడ్-19 వంటి ప్రమాదకర వైరస్‌లకు వ్యాక్సిన్లతో పాటు మెరుగైన చికిత్స అవసరం. టీకాలు సమర్థంగా ప్రభావం చూపని కేసుల్లో మా చికిత్సా విధానం అవసరమవుతుంది. టీకాలు వేయించుకోని వారికీ ఇది అవసరమే. ఎందుకంటే వైరస్ పరివర్తనం చెందే కొద్దీ వ్యాక్సిన్లు అంతగా ప్రభావం చూపవు. బ్రిటన్ పరిశోధనారంగంలోనే మా ట్రయల్స్ గొప్ప విజయం అందుకుంటాయి. సరైన ప్రోత్సాహం లభిస్తే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ నివారణకు మా ఔషధం సాయపడుతుంది’ అని సినైర్జెన్ సీఈవో రిచర్డ్ మర్స్‌దెన్ అన్నారు. తమ అధ్యయనం విజయవంతం అయితే భారీ స్థాయిలో ఇన్‌హేలర్లను తయారు చేసి సరఫరా చేస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం కొన్ని దేశాల్లో కరోనా
వైరస్ టీకాలకు అత్యవసర అనుమతి లభించింది. బ్రిటన్, అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల్లో వ్యాక్సినేషన్
నడుస్తోంది. భారత్‌లోనూ టీకాలు ఇచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. మరికొన్ని
రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు,
అధికారులు, పెద్ద వయస్కులకు కొవాగ్జిన్,
కొవిషీల్డ్‌ను ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
0 Komentar