UPSC Recruitment 2021: Application
Begins For 249 Vacancies for Various Posts
యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2021 - 249 పోస్టులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 249
1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 06
అర్హత: సుగర్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా/ ఆయిల్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
2) అసిస్టెంట్ డైరెక్టర్: 01
అర్హత: సివిల్ ఇంజినీరింగ్
డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
3) స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 45
విభాగాల వారీగా ఖాళీలు: ఫోరెన్సిక్ మెడిసిన్-06, పబ్లిక్ హెల్త్-05, సర్జికల్ ఆంకాలజీ-02, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/ కమ్యూనిటీ మెడిసిన్-12, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేషన్-07, రేడియో థెరపీ-07, యూరాలజీ-06.
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
4) లెక్చరర్: 01
అర్హత: సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రేండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
5) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 80
అర్హత: లా డిగ్రీ(ఎల్ఎల్‌బీ) ఉత్తీర్ణత. బార్ అసోసియేషన్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
6) డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 116
అర్హత: కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ (లేదా) కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్థతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.25
చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 11.02.2021.
0 Komentar