UPSC Recruitment 2021 for Specialist
Grade III Assistant Professor
యూపీఎస్సీ-స్పెషలిస్ట్ గ్రేడ్3
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇతర ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
1) అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్): 01
అర్హత: ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
2) స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 55 పోస్టులు
విభాగాలు: డెర్మటాలజీ, వెనెరియాలజీ అండ్ లెప్రసీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటిరాలజీ, ఆప్తల్మాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
3) అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్): 01 పోస్టు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనలైటికల్ మెథడ్స్/ పరిశోధనలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/ రిక్రూట్‌మెంట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.01.2021.
0 Komentar