UPSC: Setback from Centre for Those
Who Missed Last Attempt Due To COVID
సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోం - సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
కరోనా కారణంగా గత ఏడాది జరిగిన
యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన అభ్యర్థులకు మరో
వెసులుబాటు ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని జనవరి 22న
సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించిన కేసును విచారిస్తున్న జస్టిస్
ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు
ఈ విషయాన్ని చెప్పారు. దీనిపై ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. దాంతో
కేసు విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
0 Komentar