VIT 'STARS" Programme: STARS - SUPPORT THE ADVANCEMENT OF RURAL STUDENTS
గ్రామీణ ప్రతిభావంతులకు ఉచిత విద్య - వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు
గ్రామీణ ప్రాంతాల్లోని
ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువుకు పేదరికం అడ్డుగా ఉండకూడదనే సంకల్పంతో తమ
యూనివర్సిటీ 'స్టార్స్' పేరిట ప్రత్యేక
కార్యక్రమాన్ని ప్రారంభించిందని వీఐటీ-ఏపీ (వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం) ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. గుంటూరు
జిల్లా ఐనవోలులోని వీఐటీ క్యాంపస్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ
కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ (ఎంపీసీ) చదివి, జిల్లాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు తమ యూనివర్సిటీలో
నాలుగేళ్లపాటు ఉచితంగా ఇంజినీరింగ్ విద్యతో పాటు వసతిని కల్పిస్తున్నామన్నారు. అనంతరం
అర్హత సాధించిన 'స్టార్స్' నాలుగో
బ్యాచ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్స్ అందజేశారు. విశ్వ విద్యాలయ ఉప కులపతి
డాక్టర్ ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ స్టార్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. విశ్వవిద్యాలయ
రిజిస్ట్రార్ డాక్టర్ సి. యల్.వి. శివకుమార్.. వివిధ దేశాలకు చెందిన అత్యుత్తమ
అధ్యాపకులు వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్
డైరెక్టర్ (అడ్మిషన్స్) డాక్టర్ ఆర్. తహియ అప్జాల్, విద్యార్థులు,
తల్లిదండ్రులు పాల్గొన్నారు.
0 Komentar