10% Of LIC IPO Issue Size to Be Reserved
for Policyholders
ఎల్‌ఐసీ ఐపీఓలో పాలసీదార్లకు 10%
రాబోయే ఎల్‌ఐసీ తొలి పబ్లిక్
ఇష్యూ (ఐపీఓ) పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనున్నట్లు
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. పాలసీదార్ల ప్రయోజనాల
దృష్ట్యా ఎల్‌ఐసీలో మెజారిటీ వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుందని, నియంత్రిత వాటా అట్టేపెట్టుకుంటుందని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక
సమాధానంలో మంత్రి వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు
తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైనాన్స్ బిల్లులో ఎల్‌ఐసీ సవరణ చట్టాన్ని
పొందుపరచడంతో.. త్వరలో చట్టసభల ఆమోదానికి రానుంది. ఎల్‌ఐసీ ఐపీఓ సలహాదారులుగా
డెలాయిట్, ఎస్‌బీఐ క్యాప్స్ వ్యవహరిస్తున్నాయి.
0 Komentar