సీబీఐలో 1374 ఉద్యోగాలు ఖాళీ: కేంద్రం
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఉద్యోగాల్లో ఖాళీలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతేడాది డిసెంబర్ 31 వరకు మొత్తంగా 1374 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ సంస్థలో 7273 ఉద్యోగాలు మంజూరు కాగా.. 5899 ఉద్యోగాలు భర్తీ అయినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వ సమాధానంలో పేర్కొన్నారు. 5వేల ఎగ్జిక్యూటివ్ ర్యాంకు పోస్టుల్లో 4171 భర్తీ చేసినట్టు తెలిపారు. అలాగే, 1671 మినిస్టీరియల్ ర్యాంకు ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉండగా.. వాటిలో 1353 భర్తీ చేసినట్టు వివరించారు. క్యాంటీన్ సిబ్బంది 70మంది కావాల్సి ఉండగా.. 25 మందిని భర్తీ చేసినట్టు తెలిపారు. అన్ని ర్యాంకుల ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్ 31
నాటికి ఏడాదికి పైగా దర్యాప్తులో పెండింగ్ రెగ్యులర్ కేసులు (ఆర్‌సీ) సంఖ్య 588గా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 2019 డిసెంబర్ 31 నాటికి 711 ఉండగా.. గతేడాది డిసెంబర్ నాటికి ఆ
సంఖ్య 588గా ఉన్నట్టు తెలిపారు. 2020లో
ఇలాంటి వాటిలో ఆరు కేసులు రాజకీయ నాయకులపై ఉన్నాయని తెలిపారు.
0 Komentar