Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AO-2021: Novak Djokovic Defeated Daniil Medvedev For Record-Extending Ninth Title

 

AO-2021: Novak Djokovic Defeated Daniil Medvedev For Record-Extending Ninth Title

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 విజేత జకోవిచ్ – తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన సెర్బియన్

ప్రపంచ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో ఘన విజయం సాధించాడు. తొలిసెట్‌ హోరాహోరీగా సాగినా.. తర్వాతి రెండు సెట్లలో అతడే‌ పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఏస్‌లు సంధించిన అతడు.. 20 విన్నర్లు కొట్టాడు.

ఈ విజయంతో కెరీర్లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ సెర్బియా ఆటగాడు 18 గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఆడిన అన్నిసార్లూ జకోవిచ్ విజేతగా నిలవడం విశేషం. 

కాగా, జోకోవిచ్‌కు తన కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవడం ఇది తొమ్మిదోసారి. వరుసగా గత మూడుసార్లు ఈ టైటిల్‌ను అందుకున్నాడు. అంతేగాక అతడు ఆడిన అన్ని ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం విశేషం. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మరోవైపు ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరడానికి జకోవిచ్‌ మరో రెండు టైటిళ్ల దూరంలో ఉన్నాడు. ఫెదరర్‌, నాదల్ చెరో 20 గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. 

Previous
Next Post »
0 Komentar

Google Tags