AP Covid-19 Media Bulletin 01-02-2021
ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24
గంటల్లో 21,922 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 64 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర
వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల
సంఖ్య 8,87,900కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,154 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 99 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,504కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,242 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,31,59,794 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో
వెల్లడించింది.
0 Komentar