AP Covid-19 Media Bulletin 02-02-2021
ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 104 కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,004కి చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,156 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 147మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,651కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,197 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,31,89,103 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో
వెల్లడించింది.
0 Komentar