AP Covid-19 Media Bulletin 03-02-2021
ఏపీలో కొత్తగా 95 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24
గంటల్లో 25,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 95 కేసులు నిర్ధారణ కాగా.. విశాఖలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన
మొత్తం కేసుల సంఖ్య 8,88,099కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పటివరకు 7,157 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు
వ్యవధిలో రాష్ట్రంలో 129 మంది పూర్తిగా కోలుకోగా..
ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,780కి
చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,162 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,32,14,548 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో
వెల్లడించింది.
0 Komentar