AP Covid-19 Media Bulletin 05-02-2021
ఏపీలో 97 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 97
మంది కొవిడ్ బారిన పడ్డారని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కృష్ణా జిల్లాలో
ఒకరు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మొత్తం 33,876 శాంపిళ్లను పరిశీలించినట్లు పేర్కొంది. గడిచిన 24
గంటల్లో 179 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు
తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,88,275 మంది కొవిడ్
బారిన పడగా.. 7,158 మంది ప్రాణాలు కోల్పోయారని
వెల్లడించింది. ప్రస్తుతం 1071 యాక్టివ్ కేసులు ఉన్నాయని
తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,32,76,678
శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
0 Komentar