ఏపి: బీఈడీ కౌన్సెలింగ్ లో జాప్యం -
బోధన రుసుములు ఖరారుకాక నిలిచిన ప్రవేశాలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) ప్రవేశాల కౌన్సెల్లింగ్ పై జాప్యం కొనసాగుతోంది. బోధన రుసుముల ఖరారు, కౌన్సెలింగ్ పై అధికారులు చేస్తున్న ఆలస్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. 10వేల మంది అభ్యర్థులు 3 నెలలకు పైగా ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్నారు.
కౌన్సెలింగ్ కు ముందు
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బోధన రుసుము లను
ఖరారు చేయాల్సి ఉంటుంది. వీటిని ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులివ్వాలి. ఆ
తర్వాతే ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియ బోధన
రుసుముల ఖరారులోనే నిలిచిపోయింది. కరోనా ప్రభావం లేకపోతే ఈ సమయానికి దాదాపుగా
విద్యా సంవత్సరం ముగింపునకు చేరేది. బీఈడీలో ప్రవేశానికి గతేడాది అక్టోబరు 1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అదే నెల 24న ఫలితాలు
విడుదల చేశారు.
0 Komentar