పాలిటెక్నిక్ లెక్చరర్ల ఇంటర్వ్యూ
షెడ్యూల్ లో మార్పులు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒక
రోజు ముందే
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో
లెక్చరర్ పోస్టుల కు సంబంధించి ఓరల్ టెస్ట్ షెడ్యూల్‌ను సవరించినట్లు ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మున్సిపల్
ఎన్నికల షెడ్యూల్ కారణంగా, ముందుగా ప్రకటించిన తేదీ కన్నా ఒక రోజు
ముందే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మూడో తేదీ నుంచి పదో తేదీ వరకు
ఇంటర్వ్యూలు జరగనున్నట్లు ఇదివరకే ప్రకటించగా, మార్చి పది
నుంచి మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో రెండో తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు
స్పష్టం చేశారు.
0 Komentar