ఏపి: ఇంటర్ పరీక్ష ఫీజును విద్యార్థులే చెల్లించొచ్చు - వెబ్‌సైట్‌లో క్యూఆర్‌కోడ్ హాల్‌టికెట్లు
ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇంటర్ విద్యామండలి
పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ వరకు ఇంటర్ విద్యామండలి ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. రుసుములు చెల్లించలేదని, ఇతర కారణాలతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. కళాశాలలతో సంబంధం లేకుండానే పరీక్ష ఫీజు చెల్లించే సదుపాయాన్ని మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు పరీక్ష ఫీజును కళాశాలల ద్వారా చెల్లిస్తుండగా.. ఇక నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తేలికగా చెల్లించొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత విద్యార్థి చదివే గ్రూపును నమోదు చేయగానే ఫీజు వివరాలు వస్తాయి. ఆ మొత్తాన్ని చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
క్యూఆర్‌కోడ్ హాల్ టికెట్లు
విద్యార్థులు హాల్‌టికెట్లను కూడా వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిపై కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు. పరీక్షలకు ముందే విద్యార్థుల హాజరు వివరాలను ఇంటర్ విద్యామండలి తీసుకుంటోంది. వాటి ఆధారంగా నిర్ణీత హాజరు ఉన్న వారి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టేస్తారు. విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్లకు హాల్‌టికెట్ల లింకును పంపిస్తారు. ఫోన్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లి ప్రింట్ తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్‌తో కూడిన హాల్‌టికెట్లు జారీ చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థి సమాచారంపై ఏమైనా సందేహాలు ఉంటే ఇన్విజిలేటర్లు క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి.
పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు యాప్‌ను ప్రవేశపెట్టారు. తరగతులకు హాజరుకాని వారి కోసం వర్క్‌బుక్‌లు, జేఈఈ, ఎంసెట్‌కు ఉపయోగపడే మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
0 Komentar