AP: Municipal Elections Schedule
Released
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటన విడుదల చేసింది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
గత ఏడాది మార్చి 23న
నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా
పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా
6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర
పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ
దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో
పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా
ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ తాజాగా నిర్ణయించింది.
మున్సిపల్ ఎన్నికల పూర్తి
నోటిఫికేషన్ 👇
Press Note 15-02-2021👇
0 Komentar