ఏపి: నర్సింగ్, ఇతర కోర్సులకు కొత్త ఫీజులు
బీఎస్సీ, ఎంఎస్సీ
(నర్సింగ్)సహా ఇతర కోర్సులకు వైద్య ఆరోగ్య శాఖ కొత్త ఫీజులు ప్రకటించింది. ఈ
ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యా
సంవత్సరం వరకు అమల్లో ఉంటాయని ఫిబ్రవరి 9న జారీచేసిన
ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ
కమిషన్ సిఫార్సు మేరకు ఈ ఫీజులు ఖరారు చేసినట్లు తెలిపింది. యాజమాన్య కోటా కింద
ఖరారు చేసిన ఫీజు కంటే ఎక్కువగా వసూలుచేసే మొత్తాన్ని సంస్థల అభివృద్ధికి మాత్రమే
వెచ్చించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్
విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి.
0 Komentar