ఏపి: NTSE
మరియు NMMS పరీక్షల హాల్ టికెట్లు
విడుదల
28-02-2021 వ తేదీ (ఆదివారం) న
జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) మరియు రాష్ట్రస్థాయి
జాతీయ ప్రతిభా అన్వేషణ మొదటిదశ ( NTSE Stage - 1 ) పరీక్షలకు
హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థుల యొక్క హాల్ టికెట్ లను www.bse.ap.gov.in
నందు ఫిబ్రవరి 20వ తేదీ నుండి అందుబాటులో ఉండును. విద్యార్థుల యొక్క
అప్లికేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేసి వారి యొక్క హాల్ టికెట్లను
డౌన్ లోడ్ చేసుకొనవలెను. కావున ప్రధానోపాధ్యాయులు NTSE హాల్
టికెట్ల కొరకు వారి స్కూల్ యొక్క 5 సంఖ్యల SSC స్కూల్ కోడ్
ద్వారా లాగిన్ అయి వారి సంబంధిత విద్యార్థుల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవలెను.
SSC యేతర స్కూల్ వారు (CBSE, ICSE etc.,) NTSE పరీక్షకు అప్లై చేసుకొనే సమయంలో వారికి కేటాయించిన స్కూల్ కోడ్ ను
ఉపయోగించి లాగిన్ అవడం ద్వారా వారి స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్
టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలెను. అదే విధంగా NMMS హాల్ టికెట్ల కొరకు U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్
అయి తమ స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి
విద్యార్థులకు అందచేయవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారు శ్రీ ఎ.
సుబ్బారెడ్డి గారు తెలియజేశారు.
0 Komentar