ఏపి: 7 పేపర్లుగా టెన్త్ పరీక్షలు
- జీవో విడుదల
రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సి 2021 పబ్లిక్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ
గతంలోని జీవో లను సవరిస్తూ శుక్రవారం జీవో నం.8 విడుదల
చేసింది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ ఒక్క ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను 7 పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. 2022
పబ్లిక్ పరీక్షలకు తిరిగి 11 పేపర్ల ప్యాట్రన్
అమల్లోకి వస్తుంది. 7 పేపర్లలో 5 పేపర్లు
100 మార్కుల చొప్పున, జనరల్ సైన్సులోని
ఫిజికల్ సైన్సు 50 మార్కులకు, బయోలాజికల్
సైన్సు 50 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను వేర్వేరుగా వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారని
జీఓలో పేర్కొన్నారు.
G.O.MS.No. 8 Dated: 12-02-2021. 👇
30% syllabus is reduced please make the pdf and release which topics are reduced in each lesson of all subjects
ReplyDelete