APSRTC Ticket Booking Website Changed –
Details Here
ఏపిఎస్‌ఆర్‌టిసి టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ మారింది, వివరాలివే
ఏపిఎస్‌ఆర్‌టిసి టికెట్లు బుక్ చేసుకునేవారికి అలర్ట్. ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్‌తోపాటు, అదనంగా మరో వెబ్‌సైట్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకునేందుకు www.apsrtconline.in వెబ్‌సైట్ ఉండగా..దాని స్థానంలో శుక్రవారం నుంచి కొత్తగా www.apsrtconline.org.in కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
టికెట్లు రద్దు చేసుకునే సమయంలో
వెబ్‌సైట్లలో ఏమైనా సమస్యలు ఏర్పడితే.. ప్రయాణికులు సంబంధిత టికెట్ వివరాలను refunds.apsrtc@gmail.com
మెయిల్ చేసినా, ఆ సమయాన్ని పరిగణలోకి
తీసుకొని, డబ్బులు వెనక్కి ఇచ్చే ఏర్పాటు చేసినట్లు చీఫ్
ఇంజినీర్ (ఐటీ) సుధాకర్ తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు, సూచనలు
ఉంటే 0866-2570005 నంబరుకు సంప్రదించాలని కోరారు. ఇప్పటి
వరకు ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌కు అందుబాటులో ఉన్న వెబ్‌సైట్ (www.apsrtconline.in) ఇప్పటికే
పని చేయట్లేదు. కానీ అధికారంగా ఒకటి,
రెండు రోజుల్లో పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
0 Komentar