Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Army Cancels Recruitment Exam After Paper Leaked

 

Army Cancels Recruitment Exam After Paper Leaked

పేపర్‌ లీక్‌ - ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడంతో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను పుణెలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. రిక్రూట్‌మెంట్‌ విషయంలో ఎలాంటి అక్రమాలకూ తావు ఉండకూడదనే ఉద్దేశంతో పరీక్ష రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

ఆర్మీ సోల్జర్స్‌ (జనరల్‌ డ్యూటీ) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ కోసం రూపొందించిన పేపర్‌ శనివారం రాత్రి లీకయినట్లు గుర్తించామని చెప్పారు. స్థానిక పోలీసులతో కలిసి నిందితులను గుర్తించామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు. రిక్రూట్‌మెంట్‌ విషయంలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags