నేడు 15వ
ఆర్థిక సంఘం నివేదిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ సోమవారం పార్లమెంటుకు 15వ ఆర్థిక సంఘం నివేదికను
సమర్పించనున్నారు. 2021-26 సంవత్సరాలకు సంబంధించి కేంద్ర,
రాష్ట్రాల మధ్య వనరుల విభజనకు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులపై కేంద్ర
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందుకు సంబంధించిన కార్యాచరణ
నివేదికనూ ఆర్థిక మంత్రి పార్లమెంటుకు సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత
ఆమె ఈ నివేదికను సభ ముందుంచుతారు.
0 Komentar