ఏపి: వేతన, పింఛను బకాయిలపై 6% వడ్డీ చెల్లించండి - రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనర్లకు
నిలిపివేసిన 50 శాతం వేతనాలు, పింఛన్లకు
ఆరు శాతం వడ్డీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొవిడ్ నేపథ్యంలో
రాష్ట్ర ప్రభుత్వం మార్చి, ఏప్రిల్ నెలల్లో వేతనాలు,
పింఛన్లు సగమే చెల్లించడంతో బకాయిలపై విశ్రాంత న్యాయమూర్తి
డి.లక్ష్మీకామేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. బకాయిలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లింది.
జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన
ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వేతన, పింఛన్ల
బకాయిలకు 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
Which State Ap or TS..?
ReplyDeleteAP. You can find 'ఆంధ్రప్రదేశ్' in the middle of the content already. Now we have updated in the heading also now.
Delete