ఆర్జీయూకేటీలో ప్రత్యేక విభాగాల
అభ్యర్థులకు కౌన్సెలింగ్
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక
విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఎన్‌సీసీ, సైనిక,
క్రీడలు, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన 257 సీట్లు, ఎస్టీ కేటగిరీలో మిగిలిన 9 సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 07న నూజివీడు
ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కులపతి ఆచార్య కె.సి.రెడ్డి, ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు ప్రక్రియను
పర్యవేక్షించారు. కోరుకున్న క్యాంపస్‌లో సీటు రాకపోవడంతో ప్రవేశం పొందిన కొందరు ఆయా
ట్రిపుల్ ఐటీల్లో చేరలేదు. ఆ ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ ఎప్పుడు చేపట్టాలనే
విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని గోపాలరాజు తెలిపారు.
0 Komentar