Brazilian, Indian startup satellite part
of ISRO's first mission in 2021
ఈ నెల 28న
ప్రైవేటు ఉపగ్రహాల ప్రయోగం - ఇస్రో ఛైర్మన్ కె.శివన్
వెల్లడి
కొత్త ఏడాది (2021)లో ఇస్రో తొలి
ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో వాహక నౌక ద్వారా తొలిసారిగా ప్రైవేటు సంస్థల
ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ డా.కె.శివన్ శుక్రవారం
వెల్లడించారు. ఈ నెల 28న పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన
అమెజానియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలను
ప్రయోగించనున్నట్లు తెలిపారు. భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్’ను బెంగళూరుకు చెందిన
అంకుర సంస్థ పిక్సెల్ రూపొందించగా, ‘సతీశ్ ధావన్’ను
చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్
(శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్),
శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారని
చెప్పారు. అమెజానియా-1, బ్రెజిల్ రూపొందించిన తొలి భూ
పర్యవేక్షణ ఉపగ్రహమని..అంతరిక్ష రంగంలో సంస్కరణల తర్వాత ఈ ప్రయోగం ఇస్రోకు ఎంతో
ప్రత్యేకమని కె.శివన్ పేర్కొన్నారు.
0 Komentar