CBSE Issues Guidelines for Class 9, 11
Exams; Recommends New Academic Session Begin from April 1
9, 11 తరగతుల పరీక్షలు నిర్వహించండి - ఏప్రిల్ 1 నుంచి సీబీఎస్ఈ విద్యా సంవత్సరం
కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ 9, 11వ
తరగతి పరీక్షలు నిర్వహించాలని తన పరిధిలోని విద్యాసంస్థలను సీబీఎస్‌ఈ ఉత్తర్వులు
జారీ చేసింది. ‘‘పరీక్షల నిర్వహణ సమయంలో కొవిడ్-19 రక్షణ ప్రొటోకాల్స్
తప్పనిసరిగా పాటించాల్సిందే. 2021-22 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి
ప్రారంభించడం సముచితం. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం
తీసుకోవాలి’’ అని సీబీఎస్‌ఈ పేర్కొంది.
ఏప్రిల్ 1
నుంచి సీబీఎస్ఈ విద్యా సంవత్సరం
ఏప్రిల్ 1 నుంచి
2021-22. విద్యా సంవత్సరాన్ని తగు జాగ్రత్తలతో
ప్రారంభించుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)
పేర్కొంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం పై స్పష్టత కోరుతూ అనుబంధ కాలేజీల నుంచి
పెద్దఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీబీఎస్ఈ స్పందించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కోరింది. అలాగే 9, 11వ తరగతి పరీక్షల పైనా స్పష్టత ఇచ్చింది. ఇప్పటివరకు తరగతులన్నీ ఆన్
లైన్లోనే జరిగినందున. ముందుగా విద్యార్థులను పిలిచి వారి సమస్యలు తెలుసుకోవాలని,
అనుమానాలు నివృత్తి చేయాలని సీబీఎస్ఈ పరీక్ష విభాగం కంట్రోలర్ భరద్వాజ్
కోరారు.
0 Komentar