CBSE Time Table 2021: Class 10th &
12th Date Sheet Released
సీబీఎస్‌ఈ 2021 పరీక్షల షెడ్యూల్ విడుదల
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ షెడ్యూల్‌ను నేడు (ఫిబ్రవరి 2) న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్ లో ప్రకటించారు. అలాగే, విద్యార్థులకు చెందిన 40 ఏళ్ల రికార్డులను సీబీఎస్‌ఈ డిజిటిలైజ్ చేయనుందని తెలిపారు.
మరోవైపు, సీబీఎస్‌ఈ
10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ఈ ఏడాది మే 4 నుంచి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్టు డిసెంబర్ 31న మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా అయితే, ఏటా ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో..
రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా విజృంభణ
నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో
బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు
స్పష్టంచేసింది.
Date-sheet of @cbseindia29 board exams of class X.
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) February 2, 2021
Wish you good luck!#CBSE pic.twitter.com/o4I00aONmy
0 Komentar