CDAC Recruitment 2021: 100 Project
Engineer and Project Technician Posts
సీడాక్‌లో 100 జాబ్స్ - అర్హత: బీఈ, బీటెక్, ఎంసీఏ
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీడాక్‌లో 100 ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నీషియన్ పోస్టులు
ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది
ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్
ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్)లో వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న 100 ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్
టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను
కాంట్రాక్టు ప్రాతిపదిక భర్తీ చేయనుంది. అర్హత కలిగినవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను
ఎంపికచేస్తారు. అయితే ఎంపికైనవారు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.cdac.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 100
ప్రాజెక్ట్ ఇంజినీర్- 80
ప్రాజెక్ట్ టెక్నీషియన్- 20
ముఖ్య సమాచారం:
అర్హత: బీఈ లేదా బీటెక్ లేదా
ఎంసీఏ పూర్తి చేసిఉండాలి. అలాగే సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరిగా
ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మొబైల్ నంబర్, ఈ-మెయిల్
ఐడీ తప్పనిసరిగా ఇవ్వాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వాటి ద్వారానే సమాచారం
అందిస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2021
0 Komentar