Central Railway Apprentice Recruitment
2021 – Vacancies for 2532 Posts
రైల్వేలో 2500కు పైగా జాబ్స్.. టెన్త్ పాసైన వాళ్లు అర్హులు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు
అర్హులు
అప్లయ్ చేసుకోవడానికి మార్చి 5
ఆఖరు
ముంబై ప్రధాన కేంద్రంగా
పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే (Central Railway )లో వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న 2532 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5 దరఖాస్తులకు చివరితేది.
ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మార్కుల ఆధారంగా
ఈపోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ రైల్వే పరిధిలోని
ముంబై, పుణె, నాగ్‌పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్‌లలో పనిచేయాల్సి
ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 2532
క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో, వ్యాగన్ వాడి బందర్-469, ముంబై కల్యాన్ డీజిల్ షెడ్-53, కుర్లా డీజిల్ షెడ్-60, సీనియర్ డీ (టీఆర్‌ఎస్) కుర్లా, కల్యాణ్-371, పారెల్ వర్క్‌షాప్-418, మాతుంగా వర్క్‌షాప్-547, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా-60, ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్-80, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్-118, మన్మాడ్ వర్క్‌షాప్-51, టీఎండబ్ల్యూ నాసిక్‌రోడ్-49, డీజిల్ లోకోషెడ్ (పుణె)-49, ఎలక్ట్రిక్ లోకో షెడ్ (నాగ్‌పూర్)-48, అజ్ని క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-66, కుర్దువాడి వర్క్‌షాప్ (షోలాపూర్)-21 చొప్పున పోస్టులు ఉన్నాయి.
ముఖ్య సమాచారం:
అర్హత: పదో తరగతి లేదా దానికి
సమానమైన ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌టీవీసీ
సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: 15
నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: టెన్త్, ఐటీఐలో
వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 6, 2021
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 5, 2021
0 Komentar