Chandrayaan-3 launch delayed further to
2022, says ISRO chief K Sivan
చంద్రయాన్-3
వాయిదా
చంద్రుడిని చేరే ప్రయత్నంలో భాగంగా భారత్ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్ 3 వాయిదాపడింది. దీనిని 2022లో చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. 2019 సెప్టెంబరు నాటి చంద్రయాన్-2 ప్రయోగం తృటిలో విఫలమైనప్పటికీ, పట్టు వదలకుండా ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగించిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్-19 ప్రభావం చంద్రయాన్-3, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్టు సంస్థ చైర్మన్ కే శివన్ వివరించారు. నిజానికి 2020 చివరిలో జరగాల్సిఉన్న ఈ ప్రయోగాలు.. వచ్చే సంవత్సరం సాకారం కావచ్చని ఆయన ప్రకటించారు.
‘‘ఈ విషయమై మేము పరిశోధనలు జరుపుతున్నాము. ఈ ప్రయోగం కూడా చంద్రయాన్-2 మాదిరిగానే ఉన్నా దీనికి ప్రత్యేక ఆర్బిటార్ ఉండకపోవటం విశేషం. చంద్రయాన్-2 సమయంలో ప్రయోగించిన ఆర్బిటార్‌నే దీనిలోనూ వాడనున్నాము. ఈ నేపథ్యంలో ఈ మిషన్‌ను వచ్చే 2022 సంవత్సరంలో ప్రయోగించేందుకు కృషి చేస్తున్నాము.’’ అని శివన్ తెలిపారు.
ఇస్రో భవిష్యత్తులో పలు గ్రహాంతర
యాత్రలను చేపట్టనున్న నేపథ్యంలో, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్‌కు
ఉన్నాయని చాటిచెప్పే గీటురాయిగా చంద్రయాన్-3 కీలకం కానుంది. ఈ ప్రయోగం
అనంతరం ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్-3
ప్రాజెక్టుపై దృష్టి సారిస్తామని శివన్ తెలిపారు. ఇందుకుగానూ నలుగురు భారత
వ్యోమగాములు అవసరమైన శిక్షణ
పొందుతున్నారని ఆయన వెల్లడించారు.
0 Komentar