School Health Programme under Ayushman
Bharat - SHP Module in Telugu
ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన
పాఠశాల ఆరోగ్య కార్యక్రమం
శిక్షణ - ఉపయుక్త వనరులు
బడిపిల్లల ఆరోగ్యం - శ్రేయస్సు
పాఠశాలకు వెళ్లే విద్యార్థుల
అభ్యసన మరియు వికాసాన్ని ప్రభావితం చేయడంలో ఆరోగ్యం మరియు శ్రేయస్సు అనేవి చాలా
ముఖ్యమైన అంశాలు. జాతీయ విద్య మరియు పరిశోధన మండలి (NCERT) ఇప్పటికే ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై ప్రాథమిక స్థాయి నుండి ఉన్నతస్థాయి
వరకూ విద్యా ప్రణాళికను తయారు చేసింది. ప్రస్తుత శిక్షణా కరదీపిక ప్రాథమికోన్నత
పాఠశాల నుండి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ అధ్యాపకులకు
ఉద్దేశించబడినది. ఈ విద్యాప్రణాళికను, శిక్షణ కరదీపికను
పాఠశాలకు వెళ్లేవిద్యార్థులకు వారి ఆరోగ్యం పట్ల సమగ్రమైన జ్ఞానాన్ని, మానసిక సహాయాన్ని అందించేందుకు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఆయుష్మాన్ భారత్” కార్యక్రమంలో భాగంగా కేంద్ర
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర మానవ వనరుల
అభివృద్ధి శాఖలు సంయుక్త సహకారంతో NCERT ఆధ్వర్యంలో ఈ శిక్షణ
కరదీపిక రూపొందించబడినది.
ఈ శిక్షణ కరదీపికను 11 ఇతివృత్తాలుగా విభజించడం జరిగినది. అవి: ఆరోగ్యంగా ఎదగటం, భావోద్వేగాల అదుపు మరియు మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు విలువలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం, జెండర్ సమానత్వం, పోషణ, ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం, మత్తు పదార్థ దుర్వినియోగ నివారణ మరియు నిర్వహణ, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించటం, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం మరియు HIV నివారణ, హింస మరియు దాడుల నుండి భద్రత, ఇంటర్నెట్, గాడ్జెట్లు, మీడియా యొక్క సురక్షిత వాడకాన్ని ప్రోత్సహించడం. NCF-2005 (జాతీయ విద్యా ప్రణాళిక పాఠశాలకు వెళ్లే విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి వెలిబుచ్చిన అందోళన దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, ఆరోగ్యకర ప్రవర్తనను ప్రోత్సహించడంలో వారి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ అధ్యాపకులకు సహాయకారిగా ఈ పుస్తకంను రూపొందించాము.
0 Komentar