COVID-19 vaccine: Private hospitals can
charge up to ₹250 per dose
ప్రభుత్వ కేంద్రాల్లో ఫ్రీ..
ప్రైవేటుగా ₹250
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయించింది. ఇందులో టీకా ధరతో పాటు, సర్వీస్‌ఛార్జి ఇమిడి ఉంటాయి. వ్యాక్సిన్ ధర రూ.150 కాగా.. సర్వీస్ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది. కొవిడ్ టీకా రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండడంతో ‘ప్రైవేటు’లో ఒక్కో వ్యక్తి రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును మాత్రం కేంద్రమే భరించనుంది.
దేశంలో ఇప్పటికే కరోనా టీకా పంపిణీ
కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక
వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర
ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే, టీకా కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నవారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే
వెసులుబాటు కల్పించాలని కొన్ని వర్గాల నుంచి వినతులు వచ్చాయి. దీంతో పాటు
వ్యాక్సినేషన్ ప్రక్రియ మరీ ఆలస్యం కాకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం
తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేటు ఆస్పత్రులు టీకా
వేయాల్సి ఉంటుంది.
0 Komentar