You Can Soon Store Your Insurance
Policies in Digilocker
డిజిలాకర్‌లో బీమా పాలసీ పత్రాలు
ప్రస్తుతం, డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్, ఓటరు ఐడి, పాన్ కార్డ్, పాఠశాల, కాలేజ్ సర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన అనేక ఇతర పత్రాలను డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు.
త్వరలో, మీరు మీ బీమా పాలసీలను డిజిలాకర్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచగలుగుతారు. బీమా రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఆలోచనతో, పాలసీదారులకు బీమా ప్రక్రియ సులభతరం చేయాలనే లక్ష్యంతో, బీమా కంపెనీలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ బీమా పాలసీలను జారీ చేయనున్నట్లు బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రకటించింది.
డిజిలాకర్, పేరు సూచించినట్లుగానే అన్ని పత్రాల కాపీలను తమ మొబైల్ ఫోన్లలో భద్రపరచడానికి ఉపయోగపడుతుంది. డిజిటల్ లాకర్ యాప్‌ను గూగుల్ / ఆపిల్ ప్లే / యాప్ స్టోర్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం, డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్, ఓటరు ఐడి, పాన్ కార్డ్, పాఠశాల, సర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన అనేక ఇతర పత్రాలను డిజిటల్‌గా సేవ్ చేయవచ్చు. పత్రాలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ రూపంలో ఉన్నప్పటికీ ధృవీకరణ కోసం వీటిని గుర్తింపుగా పత్రాలుగా అంగీకరిస్తారు.
డిజిలాకర్ అనేది భారత ప్రభుత్వం
డిజిటల్ ఇండియా కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారు. డిజిలాకర్ భౌతిక
పత్రాల వాడకాన్ని తొలగించడం లేదా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పాలసీదారులకు సులభమైన ప్రక్రియగా
మారుతుంది.
0 Komentar