ECIL Recruitment 2021: Apply Online for
650 Technical Officer Posts
ఈసీఐఎల్‌లో 650 టెక్నికల్ ఆఫీసర్లు
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, ఈవీఎం, వీవీపాట్ కమిషనింగ్ పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు సైట్‌లలో పనిచేయడానికి 6 నెలల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
* టెక్నికల్ ఆఫీసర్
* మొత్తం ఖాళీలు: 650
అర్హత: కనీసం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది పోస్టు క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.
వయసు: 31.01.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్(బీఈ/ బీటెక్ మార్కులు), అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.02.2021.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.02.2021.
0 Komentar