FASTag mandatory from Feb 15
midnight; vehicles sans tag to pay double toll fee
ఫాస్టాగ్ తీసుకోకుంటే డబుల్
చెల్లించాల్సిందే!
ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును
పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.
వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద
ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ తప్పనిసరి
గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును
పొడిగించామన్నారు. మరోవైపు ఫాస్టాగ్ ఈ నెల 15 అర్ధరాత్రి
నుంచి (16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా
మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్ అమర్చకపోతే సదరు
వాహనాకి నిర్దేశించిన దానికంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని
పేర్కొంది.
0 Komentar