Get Discount on Flight Ticket If
Travelling with No Baggage, DGCA Issues Notice
లగేజ్ లేకపోతే,
విమాన టికెట్‌పై డిస్కౌంట్
లగేజ్ లేకుండా భారత్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే త్వరలో మీ ప్రయాణం కాస్త చౌక కానుంది. ఇకపై చెక్ ఇన్ లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇచ్చేలా దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజ్, 15 కిలోల వరకు చెక్‌ఇన్ లగేజ్‌లను తీసుకెళ్లొచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలంటే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. అయితే డీజీసీఏ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై చెక్‌ఇన్ బ్యాగ్‌లు లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు తక్కువ ధరకే టికెట్లు ఇచ్చే అవకాశముంటుంది. అయితే ఈ డిస్కౌంట్లు పొందాలంటే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగేజ్ బరువు చెప్పాల్సి ఉంటుంది.
‘‘ఎయిర్‌లైన్ బ్యాగేజీ
పాలసీ ప్రకారం.. విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్ అలవెన్సెస్‌తో పాటు
జీరో బ్యాగేజ్/నో చెక్‌ఇన్ బ్యాగేజ్ ధరల స్కీంను అందించేలా అనుమతినిస్తున్నాం.
ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఈ టికెట్ ధరల స్కీం గురించి వారికి
తెలియజేయాలి. అంతేగాక, టికెట్‌పై ప్రింట్ చేయాలి’’ అని
డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
0 Komentar