IIMB Announces National
Roll-Out of Mahatma Gandhi National Fellowship
మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్-2021) నోటిఫికేషన్ విడుదల
ఐఐఎం బెంగళూరు, భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వశాఖతో కలిసి 2021-2023 విద్యాసంవత్సరానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్(ఎంజీఎన్ఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దేశవ్యాప్తంగా తొమ్మిది ఐఐఎంలు (ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం జమ్మూ, ఐఐఎం కోజికోడ్, ఐఐఎం లఖ్‌నవూ, ఐఐఎం నాగ్‌పూర్, ఐఐఎం రాంచీ, ఐఐఎం ఉదయ్‌పూర్, ఐఐఎం విశాఖపట్నం ఆతిధ్యం ఇస్తున్నాయి. ఐఐఎం బెంగళూరు మాత్రం ఉమ్మడి ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తోంది.
వివరాలు
* మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) 2021-2023
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 0-3 ఏళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రధాన్యతనిస్తారు.
సంబంధిత లోకల్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఈ పరీక్ష ఉంటుంది. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష 2021 ఏప్రిల్ మూడో వారంలో ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
స్టైపెండ్: 2021-2023 ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాంకు ఎంపికై అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖ మొదటి ఏడాది నెలకు రూ.50000, రెండో ఏడాది నెలకు రూ.60000 స్టైపెండ్‌ను అందిస్తోంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తుకు చివరి తేది: 27.03.2021.
* ప్రవేశ పరీక్షకు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: 27.03.2021.
* పరీక్ష తేది: 2021 ఏప్రిల్ మూడో వారం.
* ఫలితాల వెల్లడి తేది: 2021 ఏప్రిల్ చివరి వారం.
* పర్సనల్ ఇంటర్వ్యూ తేది: 2021 మే 2 నుంచి 4 వారం.
0 Komentar