ఇండియన్ నేవీలో 1159 ట్రేడ్స్‌మెన్‌మేట్ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ నేవీ దేశంలోని వివిధ నావెల్ కమాండ్‌ల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
* మొత్తం ఖాళీలు: 1159
* ట్రేడ్స్‌మెన్‌మేట్
గ్రూప్-సీ(నాన్ గెజిటెడ్ ఇండస్ట్రీయల్) పోస్టులు
ప్రాంతాల వారీగా ఖాళీలు:
1. ఈస్టర్న్ నావెల్ కమాండ్: 710
2. వెస్టర్న్ నావెల్ కమాండ్: 324
3. సదరన్ నావెల్ కమాండ్: 125
అర్హత: 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 03 ఏళ్లు, ఇతర అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులను ముందుగా రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
1. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25
2. న్యూమరికల్ ఎబిలిటీ-25
3. జనరల్ ఇంగ్లిష్-25
4. జనరల్ అవేర్‌నెస్-25 మార్కులు ఇస్తారు.
సబ్జెక్టల వారీగా పరీక్షలో వచ్చే అంశాలు
1. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: సిరీస్, లాజికల్ వెన్ డయాగ్రమ్స్, అనాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డ్రాయింగ్ ఇన్‌ఫెరెన్స్, కోడింగ్-డీకోడింగ్ తదితరాలు.
2. న్యూమరికల్ ఎబిలిటీ: కాలం-పని, నిష్పత్తులు, సరాసరి, లాభనష్టాలు, శాతాలు, త్రికోణమితి తదితరాలు.
3. జనరల్ ఇంగ్లిష్: గ్రామర్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, కాంప్రిహెన్షన్ తదితరాలు.
4. జనరల్ అవేర్‌నెస్: జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ తదితరాలు.
ఉద్యోగ వివరణ:
1. షాప్/ షిప్/ సబ్‌మెరైన్‌లో మెయింటనెన్స్ పని చేయాలి.
2. జనరల్ క్లిన్ చేస్తుండాలి.
3. సంస్థకు సంబంధించిన దస్త్రాలు, పేపర్లను అవసరమైన చోటకు మార్చుతూ ఉండాలి.
4. ఉన్నత ఉద్యోగులకు సంబంధించిన ఫాక్స్, ఉత్తరాలు వంటి అంశాలను నిర్వహించాలి.
5. డాక్‌ను డెలివరీ చేయాలి.
6. వార్డ్ డ్యూటీ తదితర బాధ్యతలు నిర్వహించాలి.
జీతభత్యాలు: సంబంధిత స్పెషలైజేషన్ అనుసరించి ఏడో పే కమిషన్ ప్రకారం నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.205/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.02.2021.
దరఖాస్తులకు చివరి తేది: 07.03.2021.
Must and should iti qualification or not
ReplyDeleteYes, its must as per notification. Read point number 5 in the notification. ITI certificate is required. All the best
Delete