Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy Recruitment 2021: Notification for Sailors Under Sports Quota

 

Indian Navy Recruitment 2021: Notification for Sailors Under Sports Quota

ఇండియ‌న్ నేవీ- స్పోర్ట్స్ కోటా సెయిల‌ర్ పోస్టులు

ఇండియ‌న్ నేవీ 2021 సంవ‌త్స‌రానికి స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

* సెయిల‌ర్ - స్పోర్ట్స్ కోటా ఎంట్రీ - 01/ 2021 బ్యాచ్‌ 

1) డెరెక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీస‌ర్‌:

అర్హ‌త‌: ఎదైనా స‌బ్జెక్టుల్లో ఇంటర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్స‌మా ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌.  

స్పోర్ట్స్ ప్రొఫిషియ‌న్సీ: అంత‌ర్జాతీయ‌/ జాతీయ/ రాష్ట్ర స్థాయి సీనియ‌ర్/ జూనియ‌ర్  టీమ్ గేమ్స్‌, వ్య‌క్తిగ‌త అంశాల్లోనైనా పాల్గొని ఉండాలి. 

వ‌య‌సు: కోర్సు మొద‌ల‌య్యే నాటికి 17-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.02.1999 - 31.01.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

2) సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌(ఎస్ఎస్ఆర్‌) 

అర్హ‌త‌: ఎదైనా స‌బ్జెక్టుల్లో ఇంటర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్స‌మా ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌. 

స్పోర్ట్స్ ప్రొఫిషియ‌న్సీ: అంత‌ర్జాతీయ‌/జాతీయ/రాష్ట్ర స్థాయి/యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించే ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ టోర్న‌మెంట్ల‌లో పాల్గొని ఉండాలి. 

వ‌య‌సు: కోర్సు మొద‌ల‌య్యే నాటికి 17-21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.02.2000 - 31.01.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

3) మెట్రిక్‌ రిక్రూట్స్‌(ఎంఆర్‌) 

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. 

స్పోర్ట్స్ ప్రొఫిషియ‌న్సీ: అంత‌ర్జాతీయ‌/జాతీయ/రాష్ట్ర స్థాయి టోర్న‌మెంట్ల‌లో పాల్గొని ఉండాలి. 

వ‌య‌సు: కోర్సు మొద‌ల‌య్యే నాటికి 17-21 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 01.04.2000 - 31.03.2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

ఎంపిక విధానం: అర్హులైన అభ్య‌ర్థుల్ని సంబంధిత నావ‌ల్ సెంట‌ర్స్‌లో ట్ర‌యల్స్‌కి పిలుస్తారు. ట్ర‌యల్స్‌లో అర్హ‌త సాధించిన వారికి ఐఎన్ఎస్ హ‌మ్లా, ముంబ‌యిలో మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 07.03.2021. 

చిరునామా: THE SECRETARY, INDIAN NAVY SPORTS CONTROL BOARD, 7th Floor, Chankya Bhavan, INTEGRATED HEADQUARTERS, MoD (NAVY), NEW DELHI 110 021.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags