Interest on Your PF Will Be Taxed If You
Contribute More Than 2.5 Lakh Annually
పీఎఫ్ మొత్తాలపై పన్ను!
ట్యాక్స్ మినహాయింపులతో పాటు అధిక వడ్డీని పొందేందుకు కొందరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్)ను వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ సారి బడ్జెట్‌లో చేదు వార్త. ఏడాదిలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉద్యోగి వాటా (12శాతం), వీపీఎఫ్ కింద జమ అయ్యే మొత్తాలపై ఇక పన్ను భారం పడనుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన దానికంటే అధికంగా జమ చేసిన మొత్తాలపై వచ్చే వడ్డీపై ఈ పన్ను విధించనున్నారు. అయితే, ఉద్యోగి వాటాను మాత్రమే లెక్కించనున్నారు.
ఈ పన్ను ప్రభావం ఎక్కువ మొత్తంలో
జీతం పొందే వారిపై మాత్రమే ఉండనుంది. మొత్తం పీఎఫ్ చందాదారుల్లో కేవలం ఒక్క శాతం
మందిపై ఈ ప్రభావం ఉండబోతోందని విశ్లేషకులు అంటున్నారు. నెలకు సుమారు రూ.20వేలకు
మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే వారిపై ఈ పన్ను పోటు పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం పీఎఫ్ మొత్తాలపై వార్షికంగా 8.5 శాతం వడ్డీ వస్తోంది.
0 Komentar